ఉద్యానశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు అందజేస్తున్నాం. రైతులు కూరగా యల విత్తనాలు తీసుకొని సాగును పెంచుకోవాలి. కూరగాయల సాగుతో అధిక దిగుబడి పొంది ఆర్థికంగా బలోపేతం కావొచ్చు. ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు పథకాలను అందించడానికి కృషి చేస్తున్నాం.
– యడ్ల భిక్షంరెడ్డి, ఆత్మ చైర్మన్, ఖానాపురం
పదివేల ఎకరాల పెంపు లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగును పెంచడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. సబ్సిడీలతో పాటు ఉచితంగా విత్తనాలు, డ్రిప్‌ను అందిస్తోంది. జిల్లాలో మరో పదివేల ఎకరాల్లో కూరగాయల సాగును పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. కూరగాయల సాగుతో మంచి లాభాలు పొందవచ్చు. రైతులు కూరగాయల సాగుకు ముందుకు రావాలి.
– తరుణ్, ఉద్యానశాఖ అధికారి, ఖానాపురం


