గీసుకొండ: మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన గుర్రం రఘు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీయూఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రఘు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. కొంతకాలం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని, ఉద్యమకారుల్లో ఐక్యతను పెంపొందిస్తానని పేర్కొన్నారు.


