పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాలి

Apr 12 2026 2:18 AM | Updated on Apr 12 2026 2:18 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

వర్ధన్నపేట: ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర అంగన్‌వాడీలదేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకోవాలని ఆయన సూచించారు. వర్ధన్నపేటలోని ఎంఎంఆర్‌ ఫంక్షన్‌హాలులో మున్సి పల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణితో కలిసి 150 మంది అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు, 38 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించిందని తెలపారు. చిన్నారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన బాలామృతం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రీస్కూల్స్‌ ఏర్పాటుచేసి చిన్నారులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఇమ్మడి సుధీర్‌కుమార్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ షీభారాణి రాజేందర్‌, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement