నీటి ఎద్దడి లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

అదనపు కలెక్టర్‌ వైవీ గణేష్‌

వర్ధన్నపేట: గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ వై వీ గణేష్‌ అన్నారు. ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఇల్లంద గ్రామంలో ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశా రు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పనులు, నర్సరీ నిర్వహణ, డంపింగ్‌ యార్డ్‌ స్థలాన్ని పరిశీలించారు. కా ర్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు పక్కాగా ని ర్వహించాలన్నారు. అనంతరం గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ బేతి సాంబయ్య పలు సమస్యలను అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరమణ, ఏపీఓ నగేష్‌, జీపీఓ లావణ్య, ఉప సర్పంచ్‌ బొచ్చు జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement