న్యూస్‌రీల్
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వందలాది మంది వైద్య విద్యార్థులు ఉండే ఆయా హాస్టళ్లలో భద్రతపై నీ లి నీడలు కమ్ముకున్నాయి. అర్ధరాత్రి 12:30 నుంచి మూడు గంటల వరకు ర్యాగింగ్ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉండే హాస్టల్ వార్డెన్‌కు ఏమి తెలియకపోవడం, భద్రత విధుల్లో ఉండే సిబ్బందికి కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రొఫెసర్లు, ఇతరులకు కూడా ఇంతపెద్ద ఘటన యూజీసీ నుంచి వచ్చే వరకు తెలియకపోవడం బట్టి చూస్తే ఆ యా విద్యార్థులపై పర్యవేక్షణ కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఇప్పటికై నా కేఎంసీలో సీసీ కెమెరాలను మరింత పెంచి, రాత్రి సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడం ద్వారా వీటిని నియంత్రించే వీలుంది. ఈ ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో తమ పిల్లలు ఎవరన్న అందులో ఉన్నారా అని తెలుసుకునేందుకు తల్లిదండ్రులు వాకబు చేశారు.
ప్రమాదంలో కేఎంసీ వైద్య విద్యార్థుల ‘కెరీర్’
● ర్యాగింగ్ ఘటనలో పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు
● ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం
● ఆందోళనలో తల్లిదండ్రులు
భద్రతా ఉన్నా.. లేనట్టేనా..?


