● వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ ఉపేందర్, ఆర్.నాగేంద్రచారి
● హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ రామకృష్ణ, వి.నరేందర్
వరంగల్ లీగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల (2026–2027 సంవత్సరం) ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా చకిలం ఉపేందర్, ఆర్.నాగేంద్రచారి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా చొల్లేటి రామకృష్ణ, వి.నరేందర్ ఎన్నికై నట్లు రెండు జిల్లాల ఎన్నికల ప్రధాన అధికారులు వై.శ్రీ రాఘవరావు, కొండబత్తుల రమేష్‌బాబు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. వరంగల్ బార్ అసోసియేషన్‌కు మొత్తం 695ఓట్లకుగాను 542 ఓట్లు పోలయ్యాయని, హనుమకొండకు 1,021 ఓట్లకుగాను 877 ఓట్లు పోలైనట్లు వారు పేర్కొన్నారు. అనంతరం జరిగిన లెక్కింపులో వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా చకిలం ఉపేందర్, ఆర్.నాగేంద్రచారి, ఉపాధ్యక్షుడిగా చిర్ర సాంబశివరావు, కోశాధికారిగా (మహిళా రిజర్వ్) బి.ఉమామహేశ్వరీ, సహాయ కార్యదర్శిగా (పురుషుడు) ఆడేపు సునీల్, సహాయ కార్యదర్శిగా (మహిళా) ఎస్.కవిత, సీనియర్ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా జి.సుజాత, కార్యవర్గ సభ్యులుగా ఎం.వినయ్‌కుమార్, జె.ప్రభాకర్, కిరణ్‌కుమార్, జూనియర్ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా పి.రజిత ఎన్నికై నట్లు పేర్కొన్నారు. హనుమకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పి.రఘుపతి, ఉపాధ్యక్షురాలిగా (మహిళా)జి.వనజా, సహాయ కార్యదర్శి (పురుషుడు)గా పి.శ్రీనివాస్, లైబ్రరీ సెకెట్రరీ (మహిళా)గా జె.స్వప్న, కోశాధికారిగా జె.జగన్, క్రీడా, సాంస్కృతిక విభాగం జాయింట్ సెక్రటరీగా ఎ.సందీప్‌కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఆర్.నవీన్, ఎం.సాంబ రాజు, ఈ.మహేందర్, బి.అరుణ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు(మహిళా)గా ఎన్.సంధ్యారాణి ఎన్నికల ప్రధాన అధికారులు పేర్కొన్నారు.
నామినేషన్ల ఉపసంహరణ అప్పుడే
ఈ స్థానాలు ఏకగ్రీవం
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్‌లో ఏకగ్రీవమైన స్థానాల్లో మహిళా ఉపాధ్యక్షురాలిగా వి.లలితకుమారి, గ్రంథాలయ కార్యదర్శిగా జంపాల శ్రీను, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా డి.రాజేష్, 30ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కూరపాటి అశోక్, 20ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా జీ.వీ రమణమూర్తి ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా హనుమకొండ మహిళా జాయింట్ సెక్రెటరీగా జె.సుధా, 30 ఏళ్ల సీనియర్ కార్యవవర్గ సభ్యుడిగా టి.జితేందర్‌రెడ్డి, 20ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.వెంకటేశ్వర్లు, 10 ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా వి.ఇందిరా విశాలి గతంలోనే ఏకగ్రీవమైనట్లు తెలిపారు.


