యోగాతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

యోగాతో మానసిక ప్రశాంతత

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ఖిలా వరంగల్‌: యోగా సాధనతో మనస్సు ప్రశాంతత, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖిలావరంగల్‌ మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణాల నడమ శిల్పాల ప్రాంగణంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆయుష్‌ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్‌ దినోత్స వం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరై అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి సాంబశివరావు, శామ్యూల్‌, అధికారులతో కలిసి యోగాసనాలు వే శారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం పడమర కోట ముదిరాజ్‌ భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయూష్‌ హెల్త్‌ క్యాంప్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఇక్బాల్‌, ఆయూష్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ ఎం.రాజు, డీపీఎం రాజు, నేచురోపతి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అమృత వల్లి, ఆయుష్‌ వైద్యులు రాజేందర్‌, రాము, శ్రీలత, కార్పొరేటర్లు ఉమా,దామోదర్‌, వెల్పుగొండ సువర్ణ, బోగి సురేష్‌, నర్సులు పాల్గొన్నారు.

వెండింగ్‌ యూనిట్‌ల ఎంపిక

న్యూశాయంపేట: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కలెక్టర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వెండింగ్‌ యూనిట్‌ లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఇందులో 18 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా జనరల్‌ కేటగిరీకి 13, ఎస్సీ కేటగిరీ 3, ఎస్సీ కేటగిరీ 1, మహిళా కేటగిరీలో ఒకరిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్‌డీఏ, జిల్లా అధికారులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

టెలికం సేవల విస్తృతికి చర్యలు

జిల్లాలో టెలికం సేవల విస్తరణ, నెట్‌వర్క్‌ మెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సత్యశారద కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ భాస్కర్‌రావు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సేవల విస్తరణపై విస్తృతంగా చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement