పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు అంకితభావంతో పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, దామెర, ఆత్మకూరు, నడికూడ మండలాల సర్పంచ్‌లు, అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, బోరుబావులు, పైపులైన్ లీకేజీల మరమ్మతులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.


