అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ర్యాలీ

కాశిబుగ్గ/రామన్నపేట: అవగాహన, సురక్షిత జీవన విధానంతోనే ఎయిడ్స్‌ నివారణ సాధ్యమని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిలో భాగంగా గురువారం కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సరైన అవగాహన కల్పించాలని సూచించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తమార్పిడి, కలుషిత సూదులు/సిరంజిల వినియోగం ద్వారా వ్యాపించే ఎయిడ్స్‌పై అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని, బాధితులు భయపడకుండా వాటిని వినియోగించుకోవాలని ఆమె కోరారు. అనంతరం వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్‌, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

87 ఫీట్ల రెడ్‌రిబ్బన్‌, రక్త బిందువు,

ఎయిడ్స్‌ సింబల్స్‌తో ర్యాలీ..

ఏవీవీ స్కూల్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ మాజీ ఆఫీసర్‌ కొడిమాల శ్రీనివాసరావు ఎయిడ్స్‌పై 20 సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంజీఎం కూడలి వద్ద స్టేట్‌ రిసోర్స్‌పర్సన్‌ రెడ్‌ రిబ్బన్‌క్లబ్స్‌, యూత్‌ ఫర్‌ సొసైటీ రూపొందించిన 87 ఫీట్ల రెడ్‌రిబ్బన్‌, రక్త బిందువు, ఎయిడ్స్‌ సింబల్స్‌తో ర్యాలీ నిర్వహించారు. యూత్‌ ఫర్‌ సొసైటీ బాధ్యులు దేవిశ్రీ, ప్రసాద్‌, శివరాజ్‌, రిత్విక్‌, రోహిత్‌, విష్ణు, ఎన్జీఓలు రేణుక, ప్రవళిక, లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement