గ్రామాల్లో పక్కాగా జ్వర సర్వే | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో పక్కాగా జ్వర సర్వే

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రజిని

గీసుకొండ: గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రజిని సూచించారు. రక్త పరీక్షలు, వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గీసుకొండ పీహెచ్‌సీ పరిధిలోని వంచగిరిలో గురువారం నిర్వహించిన మలేరియా వాహక నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని సందర్శించి వైద్య సిబ్బంది తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వెల్‌ ఆపరేషన్లు చేపట్టాలని, ప్రతి శుక్రవారం తప్పక డ్రైడే పాటించాలని, వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. గ్రామంలో గతంలో మలేరియా, డెంగీ వ్యాధులు నమోదయ్యాయి. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. సర్పంచ్‌ కొమ్ముల కమల, స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శౌర్య శరణ్య, హెచ్‌ఈఓ సదానందం, సూపర్‌వైజర్‌ కిరణ్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి అనిల్‌ కుమార్‌, వైద్య సిబ్బంది సుజాత, హెల్త్‌ అసిస్టెంట్లు మాధవి, లక్ష్మణ్‌, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement