వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు : బీజేపీ | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు : బీజేపీ

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో విడత భారీ నిధులను మంజూరు చేయడంపై బీజీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆమె పలువురు నాయకులతో కలిసి వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) ద్వారా ఇటీవల మంజూరైన రూ.14.44కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశలించారు. అంతకుముందు రుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కల్యాణమండపం పునర్నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు.

రెండో రోజూ సమ్మె

హన్మకొండ: విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె గురువారం రెండో రోజూ కొనసాగింది. జెన్‌కో, ట్రాన్స్‌ కోతో పాటు ఎన్పీడీసీఎల్‌లో ఆర్టిజన్‌, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఆర్టిజన్లు 3,457 మంది ఉండగా 2,760 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం, సర్కిల్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న ఆర్టిజన్లు విధుల్లో పాల్గొంటున్నారు. కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ గురువారం విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా ఈనెల 13న మరోసారి చర్చలు జరపనున్నారు. నిర్ణయం తీసుకునే స్థాయి ఉన్న ప్రతినిధులను చర్చలకు పంపాలని కార్మికశాఖ లేఖ రాసింది.

Advertisement
 
Advertisement
Advertisement