హన్మకొండ: ప్రాణం పోతూ అవయవదానం ద్వారా ఐదుగురికి ప్రాణదానం చేశాడు హనుమకొండ గాంధీనగర్‌కు చెందిన ఈవీ సతీష్ కుమార్. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, రెడ్‌క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్ రావు తమ్ముడు అయిన సతీష్ కుమార్ (56) బ్రెయిన్ హెమరేజ్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం బ్రెయిన్ డెడ్ స్థితిలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ చర్యను పలువురు అభినందించారు. మృతుడి సతీమణి అనురాధ, కుమారుడు అమయ్ రాణా మాట్లాడుతూ అవయవ దానం ద్వారా ఇతరులకు ప్రాణం పోయడం తమకు ఓదార్పునిచ్చిందని, ఆయన సేవా భావం ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.


