మ్యాపింగ్‌ సమగ్రంగా పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ సమగ్రంగా పూర్తి చేయండి

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

మ్యాపింగ్‌ సమగ్రంగా పూర్తి చేయండి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: జనగణన హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ల మ్యాపింగ్‌ను సమగ్రంగా, కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, తహసీల్దార్లతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. జీడబ్ల్యూఎంసీ పరిధి 67 రెవెన్యూ వార్డుల్లో ప్రతీ గృహ సముదాయం పూర్తిగా కవర్‌ అయ్యేలా మ్యాపింగ్‌ చేపట్టాలని సూచించారు. ఆయా సమావేశాల్లో సీపీఓ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఓ రామ్‌ దయాకర్‌రెడ్డి, జనగణన అధికారి సతీశ్‌, తహసీల్దార్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల తరలింపు పరిశీలన

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని తాత్కాలిక ఈవీఎం గోదాముల నుంచి హనుమకొండ జిల్లాకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సుబేదారి రెడ్‌ క్రాస్‌ వెనుక నిర్మించిన నూతన గోదాంకు బుధవారం తరలించారు. ఈప్రక్రియను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్‌ రెడ్డి, ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, తహసీల్దార్లు, ఎన్నికల విభాగాధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement