డ్రగ్స్‌ నియంత్రణపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నియంత్రణపై చర్యలు తీసుకోవాలి

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

డ్రగ్స్‌ నియంత్రణపై చర్యలు తీసుకోవాలి

సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

భీమదేవరపల్లి: డ్రగ్స్‌ నియంత్రణపై స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌ రికార్డులు, పలు పెండిగ్‌ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామీణ ప్రాంతాల్లో సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అదేవిధంగా ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్‌, ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement