ముగిసిన టెన్నిస్‌ ఇంటర్‌ క్లబ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన టెన్నిస్‌ ఇంటర్‌ క్లబ్‌ పోటీలు

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ జిల్లా టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జేఎన్‌ఎస్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్‌ క్లబ్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్‌–రడం శ్రీనివాస్‌ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్‌ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్‌ అసోసియేషన్‌ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, టెన్నిస్‌ వంటి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్‌ అసోసియేషన్‌ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సిరికొండ సుదర్శన్‌, వెంకట్‌ నారాయణ, డాక్టర్‌ ప్రేమ్‌రాజ్‌, డాక్టర్‌ బిల్లా మహేందర్‌రెడ్డి, డాక్టర్‌ పురుషోత్తంరావు, డాక్టర్‌ సంపత్‌రెడ్డి, కంది మనోహర్‌ రెడ్డి, పెరుమాండ్ల వెంకట్‌, క్రీడాకారులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement