జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

హన్మకొండ: మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఎంపీ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు జగ్జీవన్‌ రామ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నా రు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. దళితుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా ఎస్సీ కార్పొరేషన్‌ వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు. పబ్లిక్‌ గార్డెన్‌లో జగ్జీవన్‌రామ్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన పనులను ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. డీఆర్‌ఓ సత్యపాల్‌రెడ్డి, ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, కన్నం నారాయణ, ఎస్సీ వెల్ఫేర్‌ డీడీ నిర్మల, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ బండారి సురేందర్‌, వైస్‌ చైర్మన్లు మంద సంపత్‌, మాదాసి సురేశ్‌, కన్నం సునీల్‌, గరిగె అనిల్‌, కమిటీ సభ్యులు అంకూస్‌, రవికుమార్‌, మంద స్వరాజ్‌, చిట్యాల బాబు, బొర్ర సంపూర్ణ, కూనమల్ల అనిత, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌ కుమార్‌, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ మహేందర్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కొంగర జగన్‌మోహన్‌ పాల్గొన్నారు.

వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య

Advertisement
 
Advertisement
Advertisement