వరంగల్‌ నుంచే మైనారిటీల గళం వినిపిద్దాం | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ నుంచే మైనారిటీల గళం వినిపిద్దాం

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

మాట్లాడుతున్న అబ్దుల్‌ కరీం ట్రస్ట్‌ చైర్మన్‌ తన్వీర్‌

న్యూశాయంపేట: మైనారిటీల హక్కుల కోసం వరంగల్‌ నుంచే గళం వినిపిద్దామని టీఎస్‌ఎంహెచ్‌పీఎస్‌ (తెలంగాణ స్టేట్‌ మైనారిటీ హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ వాహబ్‌ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం వరంగల్‌, హనుమకొండ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు మైనా ర్టీలను తమ ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. అడ్వకేట్‌ అబ్దుల్‌ కరీం వెల్ఫేర్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎంఏ తన్వీర్‌ మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని సచార్‌, రంగనాఽథ్‌ మిశ్రా కమిటీలు నివేదికలు ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదవుల్లో చిన్నచూపు చూస్తూ హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. పదవుల్లో తమ వాటా దక్కేవరకు పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం వరంగల్‌, హనుమకొండ జిల్లాల నూతన కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర నాయకులు ఎండీ వసీం, తాజుద్దీన్‌, అబ్దుల్‌ కరీం, రాజ్‌మహ్మద్‌, జుబేదా, నన్నేసాబ్‌, మెహిబుద్దీన్‌, సర్వర్‌ఘాజీ, షర్ఫోద్దీన్‌, గుంషావలీ, బిలాల్‌, హమీద్‌షరీఫ్‌, అజ్మెర్‌, ఖాజాషర్ఫొద్దీన్‌, అజర్‌, గులాం హుస్సేన్‌ కరీంనగర్‌, వికారాబాద్‌ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement