ఒక అధికారి.. ఐదు కీలక బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

ఒక అధికారి.. ఐదు కీలక బాధ్యతలు

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

ఒక అధికారి.. ఐదు కీలక బాధ్యతలు

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చాహత్‌ బాజ్‌పాయ్‌ ప్రస్తుతం ఐదు కీలక పదవులను ఒకేసారి నిర్వర్తిస్తూ పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కలెక్టర్‌ హోదాతో పాటు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ (ఎఫ్‌ఏసీ), జిల్లా పరిషత్‌ సీఈఓ, డీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌, ‘కుడా’ వైస్‌ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతమైన పనుల్లో బిజీగా గడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కలెక్టరేట్‌లో అన్ని శాఖల పనులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ శాఖల సమావేశాలు, సమీక్షలతో పాటు మున్సిపల్‌, డీసీసీ బ్యాంకు కార్యక్రమాలకు హాజరవుతూ.. బాధ్యతలను సమన్వయం చేస్తున్నారు. ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులను స్వయంగా స్వీకరించి, వారికి తగిన సమాధానాలిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పనులు వే గంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకే అధికారి ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం సవాలుతో కూడుకున్నది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే, కలెక్టర్‌గా మరింత సమర్థవంతమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివిధ హోదాల్లో హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement
 
Advertisement
Advertisement