వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Mar 29 2026 6:45 AM | Updated on Mar 29 2026 6:45 AM

– IIలోu

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
ధాన్యం కొనుగోళ్లకు

సాంకేతిక విద్యకు చిరునామా..

వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకుంది. వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

జిల్లా వ్యవసాయాధికారి అనురాధ

సంగెం: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ సూచించారు. కాపులకనిపర్తి రైతు వేదికలో శుక్రవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సదిరం చంద్రమౌళి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, హార్టికల్చర్‌ అధికారి తిరుపతిరెడ్డి, మండల వ్యవసాయాధికారి బస్వపత్రి జగదీశ్వర్‌, ఏఈఓ లావణ్య, రైతులు పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ సత్యశారద ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించాలని, దిగుబడికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గతంలో మాదిరిగా ఈసారి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, రవాణాశాఖ అధికారి శోభన్‌బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ సంధ్యారాణి, జిల్లా పౌరఫరాల అఽధికారి కిష్టయ్య, వరంగల్‌ ఆర్డీఓ సుమ, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖ, మార్క్‌ఫెడ్‌ డీఎం రంజిత్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నారు.

అందుబాటులో టార్పాలిన్లు, గన్నీ సంచులు, తేమ యంత్రాలు..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్‌, మహిళా సంఘాలు, ఓడీసీఎంస్‌ ఆధ్వర్యంలో 240 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు. ఈసారి యాసంగి సీజన్‌లో 1.05 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఇప్పటికే సాగునీటి కాల్వలు, చెరువులు, బోరుబావుల కింద సాగుచేసిన పంటలు మరో 10 రోజుల్లో కోతకు రానున్నాయి. 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఏగ్రేడ్‌ క్వింటాలు ధర రూ.2,389, సాధారణ రకం క్వింటాలు ధర 2,369గా నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. నిర్దిష్ట తేమ శాతం వచ్చాకే ధాన్యం నింపడానికి గన్నీ సంచులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి కేంద్రానికి 40 వరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచనున్నారు. వర్షాలు వస్తే మరో 2,400 టార్పాలిన్లు తెప్పించనున్నారు. గతేడాది కంటే అధికంగా కొనుగోలు చేయడానికి కార్యాచరణ రూపొందించారు. టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. 47లక్షల గన్నీ సంచులకు ఇప్పటికే 27 లక్షల గన్నీ సంచులు, 9,600 టార్పాలిన్లకు 2,400 టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా 240 తేమయంత్రాలు, 240 కాంటాలు, 240 ప్యాడీక్లీనర్లు అందుబాటులో ఉంచారు.

త్వరలోనే ప్రారంభిస్తాం..

జిల్లా వ్యాప్తంగా 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. అందుకు తగిన విధంగా రైతులకు వసతులు కల్పిస్తున్నాం. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నాం.

– సంధ్యారాణి,

జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌

2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement