వర్ధన్నపేట: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నా గరాజు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నిజ మవుతుందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో అధికంగా దళితులు ఉన్నారని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఓ ప్రైవేట్ కంపెనీ సహకారంతో 25 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి
వర్ధన్నపేట: పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ అన్నారు. బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పాయ్ నుంచి నేటి మోదీ వరకు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. కార్యకర్తలు శిక్షణలో నేర్చుకున్న ప్రతీ అంశాన్ని ఆచరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షురాలు కొండేటి అనిత సత్యం వెంకటరమణను శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బన్న ప్రభాకర్, రాయపురపు కుమారస్వామి, గార్లపాటి మంజులారెడ్డి, మాదాసు రాజు, మైస రాము, రాయపురం రమ్య రాజు, నాంపెల్లి యాకయ్య, తేజనాయక్, అడుపరాజు తదితరులు పాల్గొన్నారు.
సురక్షితంగా
గమ్యస్థానాలకు చేర్చాలి
కాజీపేట రూరల్ : ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలని సూచించారు. డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు సత్యనారాయణ, పింగలి ప్రశాంత్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు పి.వెంకన్న, సీతారాం రెడ్డి, సుజాత, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.


