రైతులతో ఆర్బిట్రేషన్
సంగెం మండలంలోని సంగెం, చింతలపల్లి గ్రామాలకు చెందిన 163 గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల సమస్యలు, అభ్యంతరాలను స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించి, అందులో ఉన్న ఫిర్యాదులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పౌష్టికాహారం సమయానికి అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, ఔషధాల లభ్యత, నాణ్యమైన వైద్యసేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
ఉపాధి’ పనులను పూర్తి చేయాలి
న్యూశాయంపేట: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసి మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశహాల్‌లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సహాయ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీవాణి, పీఆర్ ఇంజనీర్ ఇజ్జగిరి, డీపీఓ కల్పనా, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
సీకేఎం ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ


