నర్సంపేట: ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకువచ్చిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. ఈ మేరకు మండలంలోని గురిజాల గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘ఉపాధి’కి కోత విధిస్తూ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వా మి, జిల్లా ఉపాధ్యక్షురాలు మొగులూరు శారద, మర్ధ నర్సమ్మ, కళావతి, వెంకన్న, మజ్జిగ అనిత, రజిత, తదితరులు పాల్గొన్నారు. అలాగే కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం పట్టణ, మండల పార్టీ కార్యకర్తల వి స్తృత స్థాయి సమావేశంలో నాగయ్య పాల్గొని మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని రగిల్చిన అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, కమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు, తదితరులు పాల్గొన్నారు.


