ఖానాపురం: అడవుల సంరక్షణ, అటవీ చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ సూచించారు. ఈ మేరకు ఇటీవల గ్రూప్–1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శిక్షణలో భాగంగా బుధవారం సాయంత్రం పాకాలకు వచ్చారు. ఈ సందర్భంగా పాకాలలో ట్రెక్కింగ్ చేసి పలు పనులను పరిశీలించారు. అనంతరం పర్యావరణ అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీలోని విలువైన సంపదను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించుకోవాలన్నారు. అడవుల్లోని వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ డీఎఫ్‌ఓ విశాల్ బత్తుల, ఎఫ్‌ఆర్‌ఓ పుప్పాల రవికిరణ్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా 99 మంది శిక్షణ అధికారులు బుధవారం రాత్రి పాకాలలోనే బస చేయగా ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేపట్టారు. గురువారం ట్రెక్కింగ్ చేపట్టనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్


