● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
● డీబీఎం 38 ఉపకాల్వపై తూము ఏర్పాటు
దుగ్గొండి: డీబీఎం 38 ఉప కాల్వపై తూము ఏర్పాటుతో రైతులకు రెండు పంటలకు సాగునీరు అందనుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం డీబీఎం 38 ఉపకాల్వ 14ఎల్‌పై తూము ఏర్పాటు చేయించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంచర్ల చెరువులోకి ఎస్సారెస్పీ నీరు ప్రవహిస్తుండటంతో రైతులు తమ చిరకాల స్వప్నం సాకారం అయిందన్నారు. రెండు పంటలకు సాగు నీరు అందనుందన్నారు. అనంతరం నీరు విడుదల చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, ఎస్సారెస్పీ డీఈ రామకృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రమేష్, సర్పంచ్ భూర రాధికచందూగౌడ్, ఒలిగె నర్సింగరావు, ఎర్ర ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నెక్కొండ: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని చంద్రుగొండ, దీక్షకుంట, నాగారం, తోపనపల్లి, అలంకానిపేట, నెక్కొండలోని నందమూరి నగర్, రాజీవ్‌నగర్ ఎస్సీ కాలనీల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, బక్కి అశోక్, కుసుమ చెన్నకేశవులు, తిరుమల్‌చౌహాన్, శ్రీనివాస్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


