ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి

Mar 23 2026 10:01 AM | Updated on Mar 23 2026 10:01 AM

హన్మకొండ కల్చరల్‌: ఆదర్శ జీవితానికి శ్రీరాము డు స్ఫూర్తి అయితే, సత్పరిపాలనకు రామరాజ్యం దిక్సూచి అని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వేయిస్తంభాల గుడిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచరాత్ర శాస్త్ర ఆగమంతో అర్చకులు సూక్తవిధానంతో విశ్వక్సేనారాధన, విష్ణుసూక్తంతో నిత్యాహ్నికం ని ర్వహించారు. అనంతరం రాములవారి ఉత్సవ విగ్రహాన్ని బాలరాముడిగా అలంకరించి గరుడ వాహనంపై ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలతో ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వైద్యులు రాహుల్‌–అక్షిత దాతలుగా వ్యవహరించారు. నిజామాబాద్‌కు చెందిన హనుమాన్‌ మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌, నరసింహచార్యులు, శ్రీవాత్సవ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement