మరిన్ని ఫొటోలు 9లోu
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లింలు ఈద్–ఉల్–ఫితర్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునుంచే నూతన వస్త్రాలు ధరించి సుగంధ ద్రవ్యాలు అద్దుకుని అల్లా నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వరంగల్ నగరంలోని బొక్కలగడ్డ, కాజీపేట, పరకాల బస్టాండ్ సమీపంలోని ఈద్గాలు, మసీదుల్లో వేలాది మంది ఒకసారి సామూహిక(నమాజ్) ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్–ముభారక్ తెలుపుకున్నారు. ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. – న్యూశాయంపేట/పరకాల
ఈద్గాల్లో సామూహిక
ప్రార్థనలు
పాల్గొన్న ఎమ్మెల్యే,
డీసీసీ అధ్యక్షుడు


