కఠిన ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు శనివారం ఈద్–ఉల్–ఫితర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు
అంబరాన్నంటాయి. ఉదయమే సమీపంలోని ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురువులు ఖుత్బా (ప్రసంగం) వినిపించారు. అనంతరం ఒకరికొకరు ఈద్–ముబారక్ చెప్పుకొని సోదరభావాన్ని చాటుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
– నర్సంపేట/గీసుకొండ
– మరిన్ని ఫొటోలు 9లోu
ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న మంత్రి కొండా సురేఖ
ఈద్గాల్లో ముస్లింల సామూహిక ప్రార్థనలు
శుభాకాంక్షలు చెప్పిన ప్రజాప్రతినిధులు


