అరణ్యానికి ఆదిశక్తులు | - | Sakshi
Sakshi News home page

అరణ్యానికి ఆదిశక్తులు

Feb 1 2026 2:58 AM | Updated on Feb 1 2026 2:58 AM

అరణ్య

అరణ్యానికి ఆదిశక్తులు

అరణ్యానికి ఆదిశక్తులు

సమ్మక్క: రాత్రి 7.58 గంటలకు

మేడారం(ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి): ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వన ప్రవేశం కార్యక్రమంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర శనివారం ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి తల్లులను వనం చేర్చారు. సాయంత్రం గద్దెల వద్ద ప్రారంభమైన వన ప్రవేశ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. పూజారులు కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. కొండాయికి గోవిందరాజును పూజారులు దబ్బగట్ల గోవర్ధన్‌, రాజారం, వడ్డె బాబు, పూనుగొండ్లకు పగిడిద్దరాజును పూజారులు పెనక బుచ్చిరాములు పడగలను తీసుకెళ్లారు. భక్తులు.. అమ్మల ఆశీస్సులతో గమ్యస్థానానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూర ధ్వనులేమీ లేకుండా తల్లుల వన ప్రవేశం నిశ్శబ్దఽంగా సాగింది. శని వారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.

తల్లులారా వెళ్లొస్తాం..

తల్లులూ వెళ్లొస్తాం.. అంటూ తీరొక్క మొక్కులు చెల్లించిన భక్తులు శనివారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. బస్టాండ్‌ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి.

బోసిపోయిన మేడారం..

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది ప్రైవేట్‌ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన స్థలాలు జాతర ముగియడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో ఉన్న మేడారం ఒక్కసారిగా బోసిపోయింది. చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం చేశారు. పోలీసులు వన్‌ వే చేయడంతో వచ్చిన దారి కాకుండా పోలీసులు సూచించిన దారిలో వాహనాలు తరలించారు.

భక్తుల రద్దీతో విరిగిన గ్రిల్స్‌

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడికి అర్ధరాత్రి సమయంలో సమ్మక్క గద్దె సమీపంలోని ఇనుప గ్రిల్స్‌ విరిగిపోయాయి. భక్తుల రద్దీ, తోపులాటతో గ్రిల్స్‌ విరిగి పక్కకు పడ్డాయి. ఆ సమయంలో భక్తులు అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. విరిగిన గ్రిల్స్‌కు ఎండోమెంట్‌ అధికారులు వెల్డింగ్‌ చేయించారు. దాంతో దర్శనాలు యథావిధిగా కొనసాగాయి.

జనం నుంచి వనం చేరిన తల్లులు

ఆదివాసీ సంప్రదాయంతో వన ప్రవేశం

వరాల మూటలు భక్తులకిచ్చారు..

వారిచ్చిన ప్రేమను మూటగట్టుకున్నారు.

ఆసీనులై అందరి మొర ఆలకించారు..

ఎనలేని కాస్మిక్‌ ఎనర్జీని ప్రసరించారు.

భక్తుల ప్రేమకు మురిసిపోయారు.

వెళ్లొస్తామంటూ తల్లులు ముందుకు కదిలారు..

ఆ దారులు.. సెలయేరులై పాదాలు తడపగా

గాలులు సుమగంధాలై నాట్యం చేశాయి.

వనాలు గొంతెత్తి సుస్వరాలు పలుకగా.

‘సాహో.. అంటూ విశ్వం స్వాగతించింది!

అరణ్యానికి ఆదిశక్తులు1
1/3

అరణ్యానికి ఆదిశక్తులు

అరణ్యానికి ఆదిశక్తులు2
2/3

అరణ్యానికి ఆదిశక్తులు

అరణ్యానికి ఆదిశక్తులు3
3/3

అరణ్యానికి ఆదిశక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement