అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలి

Feb 1 2026 2:58 AM | Updated on Feb 1 2026 2:58 AM

అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలి

అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలి

నర్సంపేట: ఎన్నికల అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు కిల్లు శివకుమార్‌ నాయుడు సూచించారు. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియను శనివారం పరిశీలించారు. నామినేషన్ల స్క్రూట్నీలో పాటించాల్సిన విధి విధానాలపై ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భాస్కర్‌, జిల్లా నోడల్‌ అధికారి నర్సింహమూర్తి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement