కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయానికి తాళం | - | Sakshi
Sakshi News home page

కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయానికి తాళం

Jan 6 2026 7:06 AM | Updated on Jan 6 2026 7:06 AM

కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయానికి తాళం

కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయానికి తాళం

నెక్కొండ: మండలకేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయానికి తాళం పడింది. దీంతో అధికారులు, సిబ్బంది కార్యాలయం తెరవక ముందే ఇళ్లకు జారుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయం అద్దె భవనంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యాలయాన్ని హనుమకొండలోని చింతగట్టుకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న భవనం యజమానురాలు దుబ్బా పార్వతి అద్దె బకాయిలు చెల్లించి కార్యాలయ ఫర్నిచర్‌, ఇతర రికార్డులు తీసుకెళ్లాలని డిమాండ్‌ చేసింది. తనకు అద్దె రూపేనా 18 నెలలుగా సుమారు రూ.3.60 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కార్యాలయానికి తాళం వేసినట్లు పేర్కొంది. దీంతో కార్యాలయ ఈఈ సురేష్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement