ఓటరు జాబితాను సవరించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాను సవరించాలి

Jan 6 2026 7:06 AM | Updated on Jan 6 2026 7:06 AM

ఓటరు జాబితాను సవరించాలి

ఓటరు జాబితాను సవరించాలి

మున్సిపల్‌ కమిషనర్లకు నాయకుల వినతి

నర్సంపేట: ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలను సవరించాలని రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్‌ భాస్కర్‌కు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా బోగస్‌ ఓట్లు నమో దు చేశారని, వీటిన్నింటిని పరిశీలించి పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌, పంజాల రమేష్‌, ఎస్‌కె.జావిద్‌, మేరుగు శివకోటి, గూడూరు సందీప్‌, బైరి మురళి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు బహిష్కరిస్తాం

వర్ధన్నపేట: వంద పడకల ఆస్పత్రిని వర్ధన్నపేట పట్టణంలోనే నిర్మించాలని లేదంటే రాబోయే మున్సిపల్‌ ఎన్నికలు పట్టణ ప్రజలు బహిష్కరిస్తారని అఖిల పక్ష నాయకులు స్పష్టం చేశారు. సోమవారం వర్ధన్నపేట మున్సిపల్‌ కమిషనర్‌కు వందపడకల ఆస్పత్రి పట్టణంలోనే నిర్మాంచాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణానికి వంద పడకల ఆస్పత్రి అప్‌గ్రేడ్‌ అయి మంజూరు కాగా ఆ ఆస్పత్రిని ఉప్పరపల్లి క్రాస్‌ రోడ్డు వద్దకు మారుస్తామని గతంలో ప్రకటన చేశారని దానిని ఉపసంహరించుకుని వర్ధన్నపేట పట్టణంలోని ఆస్పత్రి స్థలంలోనే నిర్మించే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు మైస సురేష్‌, తుమ్మల యాకయ్య, కొండేటి సత్యం, పెద్దూరి రాజ్‌కుమార్‌, సిలువేరు కుమారస్వామి, గోధుమల మధుసూధన్‌, మైస రాము, కొండేటి శ్రీనివాస్‌, హన్మకొండ సుధాకర్‌, తుమ్మల రవీందర్‌, సిలువేరు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement