టీబీ నిర్మూలనే లక్ష్యం : డీఎంహెచ్‌ఓ | - | Sakshi
Sakshi News home page

టీబీ నిర్మూలనే లక్ష్యం : డీఎంహెచ్‌ఓ

Jan 4 2026 6:49 AM | Updated on Jan 4 2026 6:49 AM

టీబీ నిర్మూలనే లక్ష్యం : డీఎంహెచ్‌ఓ

టీబీ నిర్మూలనే లక్ష్యం : డీఎంహెచ్‌ఓ

టీబీ నిర్మూలనే లక్ష్యం : డీఎంహెచ్‌ఓ

కమలాపూర్‌: టీబీ నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా జూన్‌ రెండో తేదీ నుంచి ఇంటెన్సిఫైడ్‌ టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భీంపల్లి ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం పరిధి కన్నూరులో హ్యాండ్‌ హెల్డ్‌ ఎక్స్‌రే మిషన్‌తో నిర్వహిస్తున్న స్క్రీనింగ్‌, ఎక్స్‌రే పరీక్షలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో టీబీ సోకడానికి అవకాశం ఉన్న 1.98 లక్షల మందికి వల్నరేబుల్‌ పాపులేషన్‌ను స్క్రీనింగ్‌ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,67,700 (84 శాతం) మందికి స్క్రీనింగ్‌, 62,250 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇటీవల భారత ప్రభుత్వం పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌ను జిల్లాకు అందించిందని, పీహెచ్‌సీల వారీగా షెడ్యూల్‌ తయారు చేసి పీహెచ్‌సీల్లోనే ఎక్స్‌రే తీస్తున్నట్లు తెలిపారు. డయాబెటిస్‌, బీపీ, 60 ఏళ్లు పైబడినవారు, టీబీ సోకి ఐదేళ్లు పూర్తయిన వారు, టీబీ కాంటాక్ట్స్‌, టీబీ లక్షణాలు కనిపించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హైపో గ్లసీమియాతో బాధపడుతూ.. 108లో వచ్చిన లింగంపల్లి వరలక్ష్మిని పరిశీలించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం శనిగరంలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. ఉప్పల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి పద్మశ్రీ, పల్లె దవాఖాన వైద్యాధికారులు సంయుక్త, రేణుక, రేడియోగ్రాఫర్లు మహేశ్‌, భాస్కర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ కనకలక్ష్మి, హెల్త్‌ అసిస్టెంట్లు ప్రభాకర్‌, గోవర్ధన్‌, శివశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement