నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌ | - | Sakshi
Sakshi News home page

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

Dec 14 2025 6:56 AM | Updated on Dec 14 2025 6:56 AM

నిట్‌

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌ స్టాంపులతో కాకతీయ తోరణం

ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు మరో అడుగు ముందుకేసింది కేంద్ర సమాచారశాఖ. ఈనెల 10వ తేదీన తెలంగాణలోనే తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌ను నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో అట్టహాసంగా ప్రారంభించింది. తరాల వారధిగా నిలుస్తూ.. రూపాంతరం చెందుతూ వస్తున్న పోస్టల్‌ శాఖ జెన్‌జెడ్‌గా విద్యార్థులకు మరింత చేరువవుతోంది. ఈ జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌ అందించే సేవలపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ. – కాజీపేట అర్బన్‌

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటి నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న పోస్టల్‌ స్టాంప్స్‌తో ప్రీ మాటిక్‌ స్టాంప్స్‌ పేరిట కాకతీయ కళాతోరణం స్టాంప్స్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చేర్యాల పెయింటింగ్స్‌, పోచంపల్లి చీరలు, సంక్రాంతి పండుగ, తాడు బొంగరం ఆట, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే స్టాంపులతో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం ఆకర్షణగా నిలుస్తోంది.

స్టాంప్స్‌తో

కాకతీయ కళాతోరణం

ఇటీవల ప్రారంభమైన

ఆధునిక తపాలా సేవలు

పురాతన పోస్టల్‌ స్టాంపులతో

కాకతీయ కళాతోరణం

గోడల చుట్టూ వివిధ స్టాంపుల

నమూనాలతో ముస్తాబు

సాఫ్ట్‌వేర్‌ హబ్‌ టచ్‌, ఫ్రీ వైఫై,

రౌండ్‌ టేబుల్‌ సిట్టింగ్‌

1982 నుంచి 2012వ సంవత్సరం వరకు (జెన్‌ జెడ్‌ తరం) జన్మించిన వారి అభిరుచికి అనుగుణంగా పోస్టల్‌ శాఖ జెన్‌ జెడ్‌ సేవలు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు ఫ్రీ వైఫై, మ్యాగజైన్లు చదువుకునే వసతి, పోస్టల్‌ సేవలపై అవగాహనకు కాఫీ రౌండ్‌ టేబుల్‌ సౌకర్యం, తాగునీటి వసతి, స్పీడ్‌ పోస్ట్‌పై 10 శాతం డిస్కౌంట్‌ అవకాశాన్ని నిట్‌ విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ సేవలతో పాటు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఆధార్‌, స్పీడ్‌ పోస్ట్‌ సేవలు, ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్‌ కోడ్‌ చెల్లింపులు ఇలా ఒకే చోట లభించనున్నాయి.

అనూహ్య స్పందన..

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో ఈనెల 10వ తేదీన డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ సుమిత అయోధ్య జ్యోతి ప్రజ్వలన చేసి జెన్‌ జెడ్‌ పోస్టాపీస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోస్టాఫీస్‌లో అందిస్తున్న సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. శనివారం వరకు 107 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు, 101 పీపీఎఫ్‌ అకౌంట్స్‌, 168 పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు (రూ.12 లక్షల ప్రీమియం). రూ.555తో ఏడాదికి యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని 46 మంది చేసుకున్నారు.

క్యూ ఆర్‌తో పేమెంట్‌ విధానం బాగుంది

ఇదివరకు స్పీడ్‌ పోస్ట్‌, స్టాంప్స్‌ కోసం పోస్టాఫీస్‌కు వెళ్తే నగదు చెల్లించాల్సి వచ్చేది. దీంతో సరిపడా చిల్లర లేక ఇబ్బంది పడే వాళ్లం. మా కోసమే మా కాలేజీలో ఏర్పాటు చేసిన జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌లో నగదు చెల్లింపుతో పాటు ఆన్‌లైన్‌లో క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు అందుబాటులో ఉండడంతో పేమెంట్‌ ఈజీగా మారింది. టైం దొరికినప్పుడల్లా పోస్టాఫీస్‌కు వెళ్లాలనిపిస్తోంది. – నవ్య, ఎమ్మెస్సీ విద్యార్థిని

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌1
1/5

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌2
2/5

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌3
3/5

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌4
4/5

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌5
5/5

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలి జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement