విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
సంగెం/గీసుకొండ: ఎన్నికల నిర్వహణలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. సంగెం, గీసుకొండ మండల కేంద్రాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సీపీ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు పలు సూచనలు చేసి మాట్లాడారు. ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరిన దగ్గర నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామగ్రి తిరిగి మండల కేంద్రాలకు చేరేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పక్షపాతం చూపకుండా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో సమస్యాత్మ ప్రాంతాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై వంశీకృష్ణ, గీసుకొండ ఎస్సై కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.


