పర్వతగిరిలో మాజీ మంత్రి దయాకర్‌రావుకు ఎదురుదెబ్బ
పర్వతగిరి: స్వగ్రామం పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎదురుదెబ్బ తగిలింది. పర్వతగిరిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి చీదురు శంకర్.. బీఆర్‌ఎస్ బలపర్చిన మాడుగుల రాజుపై ఘన విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గంతోపాటు వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో దయాకర్‌రావు స్థానికులకు అందుబాటులో ఉన్నా పర్వతగిరిలో అభ్యర్థిని గెలిపించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ గెలుపు గ్రామస్తులకు అంకితమని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు ఆనందం పేర్కొన్నారు.


