వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్‌గా సుధీర్‌కుమార్
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్‌గా ఇమ్మడి సుఽధీర్‌కుమార్ గురువారం తిరిగి పూర్తి బాధ్యతలు చేపట్టారు. పదోన్నతిపై ఆయన మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఎకు వెళ్లారు. సుధీర్‌కుమార్ స్థానంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమ్మయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, తిరిగి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్‌కుమార్‌కు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
నేటితో ముగియనున్న
రెండో విడత ప్రచారం
సాక్షి, వరంగల్: రెండో విడతలో ఎన్నికలు జరిగే దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో పంచాయతీ అభ్యర్థుల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇంటింటికెళ్లి ఓట్లను అభ్యర్థించిన అభ్యర్థులు పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వలస ఓటర్లకు ఫోన్‌కాల్స్ సైతం చేస్తున్నారు. వ్యూహలు రచిస్తూ గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో రెండో విడత ప్రచారం ముగియనుంది. ఈ నెల 14న ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లోని 111 స్థానాలకు 360 మంది సర్పంచ్ అభ్యర్థులు, 906 వార్డులకు 2,142 మంది బరిలో ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక ఓటర్లకు తాయిలాలు ఇచ్చి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో అభ్యర్థులున్నారు. అలాగే, ఈనెల 17న చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని వేగిరం చేశారు. 102 స్థానాలకు 307 మంది సర్పంచ్ అభ్యర్థులు, 809 వార్డులకు 1895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో
నిర్లక్ష్యం వద్దు
ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయొద్దని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, జిల్లా అధికారి కిష్టయ్య అన్నారు. రాగంపేట, కొత్తూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంటాలు ఇష్టారీతిన పెడుతూ నిర్వాహకులు మోసం చేస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రాల నిర్వాహకులు 41 కిలోలే పెట్టాలని, అధికంగా పెడితే చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18,800 మంది రైతుల నుంచి 80,614.620 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 12,547 మంది రైతుల ఖాతాల్లో రూ.127.32 కోట్లు జమచేసినట్లు వివరించారు. సొసైటీ సిబ్బంది మేరుగు రాజు, వినయ్, రైతులు పాల్గొన్నారు.
జంటసాళ్ల విధానంతో అధిక దిగుబడి
ఖానాపురం: మొక్కజొన్న సాగులో జంటసాళ్ల విధానం పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. రంగాపురం గ్రామంలో మొక్కజొన్న పంటను గురువారం ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు డీఏఓ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 53 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోందని తెలిపారు. సెప్టెంబర్‌లో 3,176, నవంబర్‌లో 2,769, డిసెంబర్‌లో ఇప్పటి వరకు 2,889 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించినట్లు తెలిపారు. పంటల సాగులో ఎక్కుగా ఫర్టిలైజర్స్ వాడితే రైతులు అనారోగ్యం పాలవుతారన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఫర్టిలైజర్ అధికంగా వాడి కాన్సర్‌తో రైతులు మృతిచెందినట్లు బీమా చెక్కుల పంపిణీ సమయంలో తెలిసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ బోగ శ్రీనివాస్, ఏఈఓ చందన, రైతులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్‌గా సుధీర్‌కుమార్
వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్‌గా సుధీర్‌కుమార్


