కొత్తపల్లి లెక్కింపు కేంద్రం వద్ద లొల్లి
మరిన్ని ఎన్నికల వార్తలు
వర్ధన్నపేట: కొత్తపల్లి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఇద్దరు వార్డు సభ్యుల మధ్య వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లగా.. కొత్తపల్లి 10వ వార్డు బరిలో కాంగ్రెస్ బలపరిచిన అనుగుల సులోచన, బీఆర్‌ఎస్ బలపరిచిన బీసుపాక నాగమ్మకు నిలిచారు. పోలైన ఓట్లు లెక్కించగా నాగమ్మకు ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. ఇరువురి అనుమతితో అధికారులు తిరిగి ఓట్లు లెక్కించగా ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. ఇద్దరు అభ్యర్థుల అనుమతి మేరకు టాస్ వేయగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అనుగుల సులోచనకు గెలిచింది. దీంతో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి కోపంతో బయటకు వెళ్లగా కార్యకర్తలు పెద్దఎత్తున గొడవకు దిగారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎక్కడి వారిని అక్కడికి పంపించారు. తిరిగి అధికారులు సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు.
కొత్తపల్లి లెక్కింపు కేంద్రం వద్ద లొల్లి


