హస్తం మద్దతుదారుల హవా
సాక్షి, వరంగల్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగిన వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో హస్తం హవా సాగింది. 91 పంచాయతీల్లో 56 మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతుదారులు కూడా 26 సర్పంచ్ స్థానాలకు దక్కించుకున్నారు. బీజేపీ మద్దతుదారు ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాలు గెలిచారు. అయితే ఇంకా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవాల్సి ఉన్నా రెబల్స్ దెబ్బతో కొన్ని సర్పంచ్ స్థానాలు చేజారాయని ముఖ్యనేతలు అంటున్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థులు కూడా గెలిచి తమ సత్తా చాటారు.
11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..
తొలి విడత ఎన్నికలు జరిగిన పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 91 పంచాయతీలకు 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 స్థానాలకు 305 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 800 వార్డులకు 215 ఏకగ్రీవం కాగా, మిగిలిన 585 వార్డులకు 1,427 మంది పోటీకి దిగారు. అయితే, గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది నుంచి 11 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరిగింది.
మండలాల వారీగా ఫలితాల వివరాలు..
కాంగ్రెస్ బలపరిచిన వారు మెజార్టీ సర్పంచ్ స్థానాలు కై వసం
డబుల్ డిజిట్ దక్కించుకొని పోటీలో నిలిచిన బీఆర్‌ఎస్
పెద్దగా ప్రభావం చూపని బీజేపీ, కొన్నిచోట్ల స్వతంత్రుల గెలుపు
మండలం గ్రామ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
పంచాయతీలు
రాయపర్తి 40 27 9 0 4
వర్ధన్నపేట 18 10 5 1 2
పర్వతగిరి 33 19 12 0 2


