కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ
నల్లబెల్లి: ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ సూచించారు. మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపులను గురువారం తనిఖీ చేశారు. రికార్డులు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, స్టాక్ బోర్డులను పరిశీలించారు. అనంతరం వీఎఫ్‌జీ నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల సమయంలో పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులకు వివరించారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి బన్న రజిత, ఏఈఓలు ఉన్నారు.


