సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
గీసుకొండ: మండలంలోని వంచనగిరి, శాయంపేటహవేలి, ఊకల్, మచ్చాపూర్, ఎలుకుర్తి, గీసుకొండ, మనుగొండ గ్రామాల ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. సీఆర్‌ఆర్ ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.1,57,73,000 నిధులతో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. కార్యక్రమాల్లో పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ కందుల అనిల్, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్, దుపాకి సంతోష్, గోదాసి చిన్న తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురిపై కేసు
నల్లబెల్లి: ఇచ్చిన అప్పు అడిగేందుకు వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలి పారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన సముద్రాల బాలరాజు ముచ్చింపుల తండాకు చెందిన శ్రీరాము ల సుజాత–భిక్షపతి దంపతులకు రూ.40 వేలు అప్పు ఇచ్చాడు. ఈ డబ్బులను అడిగేందుకు బాలరాజు మంగళవారం రాత్రి వారి ఇంటికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన శ్రీరాముల రాకేశ్, వినీత్ కర్రలతో బాలరాజుపై దాడి చేసి గాయపరిచారు. ఈ రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావని శ్రీరాముల కోటి అతడిని నిలదీశా డు. ఆ సమయంలో బాలరాజును శ్రీరాముల శంకర్, లక్ష్మి, స్వాతి లాక్కెళ్లి సిమెంట్ దిమ్మెకు కట్టేసి తీవ్రంగా కొట్టగా తలకు, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు బాలరాజు ఫిర్యాదు చేయగా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వరంగల్ మార్కెట్‌లో తడిసిన బస్తాలు 59
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల 4న పడిన వర్షానికి 59 బస్తాలు మాత్రమే తడిసినట్లు మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాస్ నివేదికలను మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయికి సమర్పించారు. మార్కెట్‌లో పత్తి సంచులు తడిసిన ఘటనపై విచారణకు మంత్రి తుమ్మల డైరెక్టర్‌ను ఆదేశించారు. డైరెక్టర్ ఆదేశాలతో జేడీఎం వరంగల్ మార్కెట్‌లో విచారణ జరిపి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. విచారణలో 7,329 బస్తాల పత్తిలో 59 మాత్రమే తడిసినట్లు తేలిందని, తడిసిన పత్తిని సిబ్బంది సాయంతో ఆరబెట్టి అదే రోజున వ్యాపారులు కొనుగోలు చేశారని విచారణ నివేదిక ప్రకారం రైతులకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
బస్తాలు పెట్టకుండా మార్కింగ్
వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తి బస్తాలను యార్డుల్లోని షెడ్ల ఎదుట లాట్లుగా పెడుతున్నారు. అక్కడి షెడ్లకు ఉన్న పైపుల నుంచి మంగళవారం కురిసిన వర్షపు నీరు డైరెక్టుగా బస్తాలపై పడడం వల్ల పూర్తిగా పత్తి బస్తాలు తడిసిముద్దవుతున్నాయి. ఈవిషయం ‘సాక్షి’ పత్రికలో రాయడంతో షెడ్లకు ఉన్న పైపులపై రెడ్ కలర్ వేయడంతో పాటు నీళ్లు పడే చోట మార్కింగ్ చేశారు. బుధవారం షెడ్ నంబర్ 4, 8 పక్కన రైతులు తమ పత్తి బస్తాలను వేసుకోకుండా ఈచర్యలు తీసుకున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు ఈ విషయం గమనించి ఎరుపు రంగు గుర్తులు ఉన్న ప్రదేశంలో పత్తి బస్తాలు ఉంచవద్దని కోరారు.


