 
															మహిళలపై వివక్ష ఆందోళనకరం
పరకాల: మహిళలు అనేక రకాలుగా వివక్షకు గురికావడం ఆందోళనకరమని పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ అన్నారు. పరకాల మున్సిపల్ కార్యాలయంలో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ బాధ్యులు మహిళలు, బాలికలపై హింస నివారణపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు, బాలికల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో హింసా రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. మహిళలు ధైర్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల యోగ క్షేమాలపై తప్పనిసరిగా దృష్టి సారించాలని కమిషనర్ సుష్మ కోరారు. సదస్సులో డాక్టర్ డి.స్వాతి, సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ మహేందర్, మండల పీఓ విమల, ఎస్సై పవన్, మెప్మా ఏడీఎంసీ సతీశ్, సర్వోదయ ప్రాజెక్టు మేనేజర్ కవిరాజ్, కోఆర్డినేటర్ శ్రీలత, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీలు ఉన్నారు.
పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
