జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు నిరీక్ష | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు నిరీక్ష

Oct 30 2025 8:05 AM | Updated on Oct 30 2025 8:05 AM

జాతీయ

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు నిరీక్ష

దుగ్గొండి: జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న నిరీక్ష ఎంపికై ందని ప్రత్యేక అధికారి మంజుల తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నిరీక్ష ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్‌ సాధించిందని పేర్కొన్నారు. నవంబర్‌ ఒకటి నుంచి హర్యాణా రాష్ట్రంలోని పానిపట్‌లో జరగనున్న జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ఆమె ఆడనుందని తెలిపారు. ఈ మేరకు నిరీక్షను పాఠశాల ప్రత్యేక అధికారి మంజుల, పీఈటీ లావణ్య, ఉపాధ్యాయులు రమ, సుభాషిణి, అనూష, పుష్పలీల, సరస్వతి, స్రవంతి, సంధ్య, రమ్యశ్రీ, స్పందన, శ్రావణి బుధవారం అభినందించారు.

పశువులకు టీకాలు

వేయించాలి

దుగ్గొండి: రైతులు తమ పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని రాష్ట్ర వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రజిని సూచించారు. మండలంలోని తిమ్మంపేట గ్రామంలో పశువుల గాలికుంటు టీకాల శిబిరాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాలు వేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. డెయిరీ ఫాం నిర్వాహకులు పాడి గేదెల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గేదెలతో పాటు దూడలకు టీకాలు వేయించాలని, దూడలను బతికించుకోకపోతే డెయిరీ నష్టాల పాలవుతుందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పశువులకు వ్యాధులు సొకే అవకాశం ఉన్నందున పశువైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందించాలని సూచించారు. 280 పాడిగేదెలు, 10 ఆవులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. జిల్లా పశు సంవర్థకశాఖ అఽధికారి బాలకృష్ణ, వైద్యాధికారి బాలాజీ, సిబ్బంది పావని, గోపాలమిత్ర ప్రసాద్‌, పాడి రైతులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సైకిల్‌ ర్యాలీ

వరంగల్‌ క్రైం: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన సైకిల్‌ ర్యాలీ ఉత్సహంగా సాగింది. ఈర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌తో పాటు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈర్యాలీని అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌, అదాలత్‌ సెంటర్‌, హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి తిరిగి ఇదే మార్గం నుంచి నక్కలగుట్ట మీదుగా పొలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయానికి చేరుకుంది. ఈర్యాలీ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సైక్లింగ్‌ రైడర్స్‌తో కలిసి పోలీస్‌ అమర వీరులకు జోహర్లు నినాదాలు చేస్తూ రైడర్స్‌ను ఉత్సాహపర్చారు. అనంతరం ర్యాలీ పాల్గొన్న సైకిల్‌ రైడర్లకు పోలీస్‌ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ర్యాలీలో అదనపు డీసీపీలు, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, బాలస్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, అనంతయ్య, నాగయ్య, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఏజే పెడల్స్‌ యాజమాన్యం, ట్రైసిటీ సైకిల్‌ రైడర్స్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, నిట్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

హారతి వేదికకు గొడుగు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన సరస్వతీనది పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్‌ వద్ద దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇవ్వడానికి ఏడు వేదికలు నిర్మించిన విషయం తెలిసిందే. ఏడు వేదికలపై తొమ్మిది హారతులు పండితులచే ఇచ్చేందుకు పుష్కరాల సమయంలో గద్దెలు నిర్మించగా, పూర్తిస్థాయిలో పైన గొడుగులు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయలేదు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అప్పటి నుంచి ప్రతీ రోజు గోదావరి హారతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కాగా, మిగిలిన పనులను పూర్తి చేయడానికి గద్దెలపై ఇనుప రాడ్డులతో గొడుగు, పరికరాలు కాళేశ్వరం చేరాయి.

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు నిరీక్ష1
1/2

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు నిరీక్ష

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు నిరీక్ష2
2/2

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు నిరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement