ఐనవోలు: భారీ వర్షానికి కొండపర్తి ఊర చెరువు కట్టు కాల్వకు బుధవారం సాయంత్రం గండి పడింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు జేసీబీతో కట్టు కాల్వను పునరుద్ధరించినట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఊర చెరువు కట్ట బలంగా లేకపోవడంతో కోతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానిక రైతులు తెలిపారు. ఇరిగేషన్ ఏఈ ప్రశాంత్, డీటీ రాజ్‌కుమార్, ఆర్‌ఐ మల్లయ్య, ఎస్సై పస్తం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పునరుద్ధరించిన ఇరిగేషన్, రెవెన్యూ,
పోలీసు అధికారులు


