తుపాన్‌తో తీవ్ర నష్టం
పరకాల: ‘మోంథా’ తుపాన్ కారణంగా పరకాల పట్టణంలోని శ్రీకుంకుమేశ్వరాలయ ప్రాంగణంలో వారం రోజులుగా నిర్మిస్తున్న మహారుద్రయాగ మండపం బుధవారం కుప్పకూలింది. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న మండపం కూలడంతో వచ్చే నెల 3న నిర్వహించనున్న మహారుద్రయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది.
పంటపొలాలు.. పత్తి చేన్లకు తీవ్ర నష్టం
పరకాల మండలంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన దశలో పంట పొలాలు వర్షానికి దెబ్బతిన్నాయి. వరికొయ్యలను చూసి రైతు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా తుపాన్ నట్టేట ముంచింది. వరికొయ్యలు నేలమట్టం కాగా, పత్తి రైతులకు కొలుకోలేని దెబ్బతగిలింది. ఇప్పటికే వాతావరణం అనుకూలంగా లేక దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో తుపాన్‌తో పత్తి బుగ్గలు సైతం తడిసిముద్దయ్యాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేలవాలిన పంటపొలాలు..
తడిసి ముద్దయిన పత్తి


