● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు
దుగ్గొండి/నల్లబెల్లి/ఖానాపురం: తుపాను నేపథ్యంలో గ్రామాల్లోని గర్భిణులను ప్రసవానికి ముందే జిల్లా ఆస్పత్రికి తరలించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సూచించారు. దుగ్గొండిలో పీహెచ్‌సీ, వెంకటాపురంలో ఉపకేంద్రం, నల్ల బెల్లి, ఖానాపురంలోని పీహెచ్‌సీలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రయాణం అనుకూలంగా ఉండకపోవడంతో గర్భిణులను ముందే సీకేఎం లేదా జీహెచ్‌ఎంకు తరలించాలని ఆదేశించారు. దుగ్గొండి వైద్యాధికారి కిరణ్‌రాజు, మెడికల్ ఆఫీసర్ రాకేశ్, సీహెచ్‌ఓ సలోమి, హెచ్‌వీ సంధ్యారాణి, ఎల్‌టీ స్వప్న, హెల్త్ అసిస్టెంట్ చాణక్య, జ్యోతి, ఏఎన్‌ఎం సరిత, నల్లబెల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఆచార్య, పల్లె దవాఖాన డాక్టర్ నిఖిల, హెల్త్ విజిటర్ హెబ్సిబా, హెల్త్ అసిస్టెంట్ కిషన్, ఫార్మసిస్ట్ రంగారావు, ఖానాపురం పీహెచ్‌సీ సిబ్బంది ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
