విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న అతి భారీ వర్షాలతో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి, హనుమకొండ సర్కిల్ ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు సూచించారు. వర్షాలతో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తతతో ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ భద్రత కోసం పాటించాల్సిన
సూచనలు..
● వర్షాలు పడుతున్న సమయంలో తడి ప్రదేశాల్లో తడిగా ఉన్న చేతులతో స్విచ్‌లు, మీటర్లు, ప్లగ్‌లు, వైర్లు తాకొద్దు.
● ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించినప్పుడు వాటి దగ్గరికి వెళ్లొద్దు. వెంటనే సమీప లైన్‌న్‌మన్‌న్‌కు లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.
● తక్కువ ఎత్తులో వెళ్లే విద్యుత్ తీగల కింద వాహనాలు నడుపొద్దు. పశువులను తీసుకెళ్లవద్దు.
● పిల్లలను విద్యుత్ పరికరాల దగ్గర ఆడనీయకుండా దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
● పొలాల్లో లేదా బోరుబావుల వద్ద పనిచేసే సమయంలో తడి నేలపై నిలబడి విద్యుత్ మోటారు స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేయకండి.
● విద్యుత్ పరికరాల్లో తడినీరు ఉంటే వాటిని వినియోగం నుంచి తొలగించాలి.
● వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిలో మునిగిన విద్యుత్ పరికరాలను తాకొద్దు.
ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ ఎస్‌ఈలు కె.గౌతంరెడ్డి, పి.మధుసూదన్‌రావు


