 
															సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలి
● వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ
అంకిత్‌కుమార్
నెక్కొండ: ఆర్థిక సైబర్ నేరాలపై పోలీసులు దృష్టి సారించి, నేరగాళ్ల ఆట కట్టించాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ సూచించారు. నెక్కొండ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు కార్యాలయ పరిసరాలు, విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను నెక్కొండ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే, సర్కిల్ పరిధి నెక్కొండ, చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లలో ఎలాంటి నేరాలు నమోదవుతున్నాయని ఆరా తీశారు. రౌడీషీటర్లు, అనుమానితుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసులు సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లు ఇళ్లను సందర్శించి, వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని చెప్పారు. ఆర్థిక సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల మూలాలపై దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేయాలని డీసీపీ ఆదేశించారు. గంజాయి, పొగాకు, మత్తు పదార్థాల నియంత్రణకు నిరంతరం పని చేయాలన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. డీసీపీ వెంట నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, నెక్కొండ, చెన్నారావుపేట ఎస్సైలు మహేందర్, రాజేశ్‌రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
