 
															వినతులు త్వరగా పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహశబరీష్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణి వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్‌కు వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు అందజేశారు. మొత్తం 112 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేష్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
