‘లక్కు.. కిక్కు’ దక్కింది! | - | Sakshi
Sakshi News home page

‘లక్కు.. కిక్కు’ దక్కింది!

Oct 28 2025 7:19 AM | Updated on Oct 29 2025 8:05 AM

‘లక్కు.. కిక్కు’ దక్కింది!

‘లక్కు.. కిక్కు’ దక్కింది!

‘లక్కు.. కిక్కు’ దక్కింది!

సాక్షి ప్రతినిధి వరంగల్‌/కాజీపేట అర్బన్‌ :

రంగల్‌ అర్బన్‌(హనుమకొండ)జిల్లాలోని 67 వైన్స్‌కు కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో టోకెన్ల తీసి దరఖాస్తుదారులకు వైన్స్‌లు కేటాయించారు. ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా చేపట్టాల్సి ఉండగా ఆలస్యంగా 12.32 నిమిషాలకు ప్రారంభమైంది. దాదాపు గంటన్నర పాటు దరఖాస్తుదారులు వైన్స్‌ వస్తుందా రాదా అంటూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలోని 67 వైన్స్‌కు టెండర్ల చివరి తేది 23వ నాటికి 3,175 దరఖాస్తులు రాగా, లక్కీ డ్రాలో వైన్స్‌ దక్కించుకున్న వారు ‘లక్కు కిక్కు’లో తేలగా దక్కనివారు నిరాశతో వెనుదిరిగారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌రావు, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ అర్బన్‌, ఖిలా వరంగల్‌ ఎకై ్సజ్‌ సీఐలు చంద్రమోహన్‌, దుర్గాభవా నీ, ప్రభాకర్‌రెడ్డి, రాజు, ఎస్సైలు పాల్గొన్నారు.

నిరాశలో 3,108 మంది దరఖాస్తుదారులు

జిల్లాలోని 67 వైన్స్‌గాను రెండేళ్ల కాలపరిమితితో గత నెల 25న ప్రభుత్వం టెండర్లు ప్రకటించి ఈ నెల 23వ తేదీని చివరి తేదీగా ఖరారు చేసింది. రూ.3 లక్షల నాన్‌ రీఫండబుల్‌ ఫీజును నిర్ణయించగా 3,175 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో 67 మందికి వైన్స్‌ రాగా, 3,108మంది నిరాశతో వెనుదిరిగారు. పదు ల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించిన సిండికేట్‌రాయుళ్ల పాచికలు ఫలించలేదు. ఫీజు రూపేణా ప్రభుత్వ ఖజానాకు రూ.95.2 కోట్ల ఆదాయం సమకూరింది. కాజీపేట పరిధిలోని కడిపికొండ వైన్స్‌కు 116 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా హనుమకొండ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలోని కమలాపూర్‌ వైన్స్‌కు 21 వచ్చాయి. కాగా, కడిపికొండ వైన్స్‌ ఎందరు దరఖా స్తు చేసుకున్నా మాదే అంటూ గత నిర్వాహకులే చేజి క్కించుకోవడం గమనార్హం. కాగా, వైన్స్‌ దక్కించుకున్న వారు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి నూతనషాపులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. తాము కోరుకున్న స్థలంలో దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.

లక్కీ డ్రాలో వైన్స్‌ రావడంతో అవధుల్లేని ఆనందం

రాని వారు నిరాశతో ఇంటిముఖం..

దుకాణాలను కేటాయించిన

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

67 వైన్స్‌ ..3,175 దరఖాస్తులు

డిసెంబర్‌ 1నుంచి నూతన

వైన్స్‌ నిర్వహణ

అత్యధికంగా కడిపికొండ 116...

అత్యల్పంగా కమలాపూర్‌ 21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement