 
															కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు
ఐనవోలు : మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం నందనం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రాంనగర్ రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను రవీందర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలు లేకుండా, తేమశాతం ఉన్న పంటలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు రూ.2,400 చెల్లించనున్నట్లు తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మండల వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రాంనగర్‌లో మాత్రమే ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సొసైటీ ఆధ్వర్యంలో ఏడు చోట్ల రాంనగర్, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేలు, గర్మిళ్లపెల్లి, ఉడుతగూడెం, ఐనవోలు గ్రామాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్‌రావు, డైరెక్టర్లు బొమ్మినేని బుచ్చిరెడ్డి, చింత బాబు, మేట చిరంజీవి, కలకోట ఎలేంద్ర, బిర్రు పద్మ, నోడల్ ఆఫీసర్ సునీల్ కుమార్, సొసైటీ సీఈఓ కోతి సంపత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
